Vijayashanthi: అవినీతికి నిజమైన బాస్.. కేసీఆర్

ABN , First Publish Date - 2023-03-09T23:50:23+05:30 IST

ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో అవినీతి సహజమైన ప్రక్రియగా మారిపోయిందని బీజేపీ(bjp) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు.

Vijayashanthi: అవినీతికి నిజమైన బాస్.. కేసీఆర్

హైదరాబాద్: ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం(Telangana) లో అవినీతి సహజమైన ప్రక్రియగా మారిపోయిందని బీజేపీ(bjp) సీనియర్ నేత విజయశాంతి(Vijayashanthi) అన్నారు. గురువారం సోషల్ మీడియాలో రాములమ్మ బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt), సీఎం కేసీఆర్‌(CM KCR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాం (Liquor scam)ఢిల్లీలో జరగడం, అందులో తెలంగాణ వ్యక్తుల ప్రమేయం ఉండడంతో మీడియా పరంగా కొంత ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పారు. దుర్మార్గం, దోపిడీలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిత్య కార్యాచరణగా మారిపోయిందన్నారు. అసలు ఈ మొత్తం అవినీతికి నిజమైన బాస్, కరప్షన్‌కి వెనక ఉన్న దొంగ, నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని ఆరోపిించారు. వాస్తవాలు తప్పక బయటకి వస్తాయని .. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బదులు చెప్పక తప్పదని విజయశాంతి ధ్వజమెత్తారు.

Updated Date - 2023-03-10T15:58:56+05:30 IST