Vijayashanthi: కేసీఆర్ దొర పాలనలో ప్రజలను బానిసలుగా చూస్తున్నారు

ABN , First Publish Date - 2023-02-25T22:59:54+05:30 IST

తెలంగాణ (Telangana) వచ్చాక రాష్ట్రం ఓ దోపిడీ దొంగ, దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లిందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrasekhar Rao) పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు.

Vijayashanthi: కేసీఆర్ దొర పాలనలో ప్రజలను బానిసలుగా చూస్తున్నారు

హైదరాబాద్: తెలంగాణ (Telangana) వచ్చాక రాష్ట్రం ఓ దోపిడీ దొంగ, దుర్మార్గుడి చేతుల్లోకి వెళ్లిందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrasekhar Rao) పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను ముత్యాల నగరం అని విదేశాలలో అనుకునే వారని, చిన్న రాష్ట్రం ఏర్పడితే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని పోరాటం చేశామని ఆమె అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక నేడు పాలన మొత్తం కేసీఆర్ కుటుంబంలోకి వెళ్లిందని విజయశాంతి మండిపడ్డారు. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలు బానిస బ్రతుకు బతికారని, ఇప్పుడు కేసీఆర్ దొర పాలనలో బానిసలుగా చూస్తున్నారన్నారు.

హైదరాబాద్‌లో రోడ్లపై గోతులు ఉంటే వెయ్యి రూపాయలు ఇస్తామని కేసీఆర్ అన్నారని విజయశాంతి గుర్తు చేశారు. ప్రజలు ట్విట్టర్‌లో గోతుల ఫోటోలు పోస్ట్ చేసి వెయ్యి రూపాయలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ను విమర్శించడం తమ ఉద్దేశం కాదని, రాష్ట్ర అభివృద్ది, ప్రజల సంక్షేమం గాడి తప్పుతుంది కాబట్టే ప్రతిపక్షమైన తాము విమర్శిస్తున్నామన్నారు. మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియకుండా కప్పిపుచ్చుతున్నారని, జీహెచ్ఎంసీని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రత్యామ్నాయ పార్టీకి రానున్న ఎన్నికలలో పట్టం కట్టాలని, కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలని, బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టాలని విజయశాంతి ప్రజలను కోరారు. కేసీఆర్ గురించి తనకు మొత్తం తెలుసు అని, లక్ష రూపాయలు లేని కేసీఆర్.. ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని?? అని ఆమె ప్రశ్నించారు. సొంత లబ్ధి కోసం కేసీఆర్ చేసిన అప్పు వల్లే, రేపు తెలంగాణ దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుందని విజయశాంతి విమర్శించారు. కూకట్‌పల్లి విలేజ్ రామాలయం కూడలిలో నిర్వహించిన ప్రజా గోస - బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగుకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి హాజరయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి

నవీన్ హత్య కేసులో మరో ట్వీస్ట్

జగన్‌పై పయ్యావుల కేశవ్‌ హాట్‌కామెంట్స్..

సంచలన నిర్ణయం తీసుకున్న షర్మిల.. వివేకా హత్య కేసులో సీబీఐ..

Updated Date - 2023-02-26T00:06:40+05:30 IST