Vijayashanti: విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న బీఆర్ఎస్
ABN , First Publish Date - 2023-03-14T23:17:31+05:30 IST
తెలంగాణ(Telangana)లో విద్యార్థిగా, ఉద్యోగార్థిగా ఉండటమంటే జీవితాన్ని బలిపెట్టడమే అనే స్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) విద్యావ్యవస్థను దిగజార్చిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు.
హైదరాబాద్(Hyderabad): తెలంగాణ(Telangana)లో విద్యార్థిగా, ఉద్యోగార్థిగా ఉండటమంటే జీవితాన్ని బలిపెట్టడమే అనే స్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) విద్యావ్యవస్థను దిగజార్చిందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి(Vijayashanti) అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్(CM KCR) తీరుపై రాములమ్మ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్తను యథతధంగా ఇస్తున్నాం. ‘‘తాజాగా రగులుతున్న టీఎస్పీఎస్సీ(Tspsc) పరీక్షల AE క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారమే ఇందుకు పెద్ద ఉదాహరణ. తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. క్వశ్చన్ పేపర్స్ (Question Papers) ఉన్న సిస్టమ్స్‌కి ఎంతో భద్రత, సీక్రెసీ ఉండాలి... కానీ, వాటికి సంబంధించిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చాలా సులువుగా నిందితులకి లభించడం... వారు ఆ పేపర్స్‌ని ప్రింట్స్ తీసుకుని, షేర్ చేసుకుని చాక్లెట్లు, బిస్కెట్లు అమ్ముకున్నంత తేలిగ్గా అమ్ముకోవడం చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం, వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయో అర్థమవుతోంది.
గతంలో ఇంటర్ పరీక్షల(Inter exams) నిర్వహణలో ఈ సర్కారు వైఫల్యం వల్ల పలువురు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని చూశాం. ఇప్పుడు లక్షలాదిమంది నిరుద్యోగులు సర్కారీ కొలువు కోసం ఆశగా ఎదురు చూస్తున్న వేళ టీఎస్పీఎస్సీ పరీక్ష(TSPSC Exam) ల క్వశ్చన్ పేపర్ లీకయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపింది. చదువుకుంటున్న విద్యార్థులైనా... కొలువు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులైనా... అన్యాయానికి ఎవరూ అనర్హులు కారన్నట్టు కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పరీక్షల్ని అగ్నిపరీక్షలుగా మార్చి విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ సర్కారుకు ఆ సెగ తగలి దహించుకుపోక తప్పదు’’ అని విజయశాంతి ధ్వజమెత్తారు.