Hyderabad.. ఓ ఇంట్లో లెక్కపత్రాలు లేని డబ్బు గుర్తించాం: సీఐ

ABN , First Publish Date - 2023-05-14T12:53:12+05:30 IST

హైదరాబాద్: రిజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో లెక్కపత్రాలు లేని డబ్బు గుర్తించామని సికింద్రాబాద్ గోపాలపురం సీఐ ఈశ్వర్ గౌడ్ తెలిపారు.

Hyderabad.. ఓ ఇంట్లో లెక్కపత్రాలు లేని డబ్బు గుర్తించాం: సీఐ

హైదరాబాద్: రిజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో లెక్కపత్రాలు లేని డబ్బు గుర్తించామని సికింద్రాబాద్ గోపాలపురం సీఐ ఈశ్వర్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగిన ఆ ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో వెంటనే ఆ ఇంటికి చేరుకుని పరిశీలించామన్నారు. ఆ సమయంలో ఇంటి యజమాని లేరని, ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో నివాసంలో సెర్చ్ చేశామన్నారు. తనిఖీల్లో పత్రాలు లేని రూ. కోటి 65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, అలాగే గోల్డ్, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పట్టుబడ్డ డబ్బు ఇల్లీగల్, హవాలాగా తమకు సమాచారం ఉందన్నారు. దీంతో ఐటీ అధికారులకు సంచారం ఇచ్చామని సీఐ ఈశ్వర్ గౌడ్ తెలిపారు.

కాగా సికింద్రాబాద్ రెజిమెంటల్ బజారులో శనివారం రాత్రి ఓ ఇంట్లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. ఈ ప్రమాదంలో చెక్క కర్రలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన ఇంట్లో భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని శ్రీనివాస్‌గా గుర్తించారు. ఓ ప్రముఖ కంపెనీలో శ్రీనివాస్‌ డీజీఎంగా పని చేస్తున్నారు. అదే కంపెనీకి సంబంధించిన గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో ఆయన హైదరాబాద్‌లో లేరు.

Updated Date - 2023-05-14T12:53:12+05:30 IST