Sharmila: సంచలన నిర్ణయం తీసుకున్న షర్మిల.. వివేకా హత్య కేసులో సీబీఐ..

ABN , First Publish Date - 2023-02-25T20:18:23+05:30 IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YSR Telangana Party President YS Sharmila Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Sharmila: సంచలన నిర్ణయం తీసుకున్న షర్మిల.. వివేకా హత్య కేసులో సీబీఐ..

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (YSR Telangana Party President YS Sharmila Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అఖిలపక్షం నేతల (All party leaders)తో భారత రాష్ట్రపతి (President) వద్దకు వెళ్లాలని షర్మిల నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, అణచివేత చర్యలను ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలోని అన్ని పార్టీల నేతలకు వైఎస్ షర్మిల లేఖలు రాయనున్నారు.

తెలంగాణ (Telangana) లో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై (Tamilisai Soundararajan)తో షర్మిల భేటీ అయి ర్యాగింగ్ అంశంపై చర్చించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకే గవర్నర్‌ను కలిశా. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో కేసీఆర్ (KCR) రాజ్యాంగం అమలు అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గూండాలు మాత్రమే ఉన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరా. వీధి కుక్కలు దాడి చేసి పసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కులేదు. తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాలను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజల పక్షాన నేను నిలబడితే ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇబ్బందులు పెడుతున్నారు. తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం వైఎస్‌ఆర్‌టీపీకి(YSRTP), ప్రతిపక్షాలకు లేదు. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరుతున్నాం. ఇదే విషయంపై త్వరలో రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం.’’ అని షర్మిల చెప్పుకొచ్చారు.

గవర్నర్‌తో సమావేశం అనంతరం... నిమ్స్‌(NIMS) లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని షర్మిల పరామర్శించనున్నారు. తెలంగాణలో ఎవరికీ భద్రత లేదన్నారు షర్మిల. ప్రీతి (Preethi) ఘటన అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై న్యాయవాదిని చంపారని గుర్తుచేశారు. ఇక వైఎస్. వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ (CBI) తన పని తాను చేయాలని కోరుతున్నామన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని షర్మిల తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

నవీన్ హత్య కేసులో మరో ట్వీస్ట్

జగన్‌పై పయ్యావుల కేశవ్‌ హాట్‌కామెంట్స్..

Updated Date - 2023-02-25T20:28:02+05:30 IST