Revanth Reddy: అలా చేయకపోతే సిట్ అధికారిపై హైకోర్టుకు వెళ్తా

ABN , First Publish Date - 2023-03-20T18:28:53+05:30 IST

సిట్‌ నోటీసులకు స్పందిస్తానని, వివరణ ఇస్తానని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Revanth Reddy: అలా చేయకపోతే సిట్ అధికారిపై హైకోర్టుకు వెళ్తా

హైదరాబాద్: సిట్‌ నోటీసులకు స్పందిస్తానని, వివరణ ఇస్తానని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. సిట్‌కు తన దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తానని, సిట్‌ నోటీసులు ఊహించినదే అని ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పారు. సిట్‌ అధికారి శ్రీనివాస్‌, కేటీఆర్ (KTR) బావమరిది ఇద్దరూ ఫ్రెండ్సే అని, ఇద్దరూ ఫ్రెండ్స్‌ అన్నందుకే తనకు సిట్‌ నోటీసులు ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్‌కు సిట్‌ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?, తనతో పాటు కేటీఆర్, సబిత, శ్రీనివాస్‌గౌడ్‌కు సిట్ నోటీసులివ్వాలని, లేకపోతే సిట్ అధికారిపై (SIT officer) హైకోర్టు (High Court)కు వెళ్తానని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ కేసు (Paper Leakage Case)లో సిట్ అధికారులు (SIT Officials) దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై విమర్ళలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి నోటీసులు ఇచ్చారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని సిట్ కోరింది. ఇటీవలే మంత్రి కేటీఆర్ (Minister KTR) పీఏ తిరుపతి (PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు అందచేయాలంటూ రేవంత్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఓకే మండలంలో వందమందికి ర్యాంకులు వచ్చాయంటూ రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో రేవంత్ వద్ద ఉన్న వివరాలతో సహా ఆధారాలు అందజేయాలని సిట్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు. ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)కు కూడా నోటిసులు ఇచ్చి, వివరాలు తీసుకుంటామని సిట్ అధికారులు అన్నారు.

Updated Date - 2023-03-20T18:35:03+05:30 IST