Revanth Reddy: అధికారంలోకి వస్తే రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం: రేవంత్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-03-12T17:08:17+05:30 IST
అధికారంలోకి వస్తే రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. రైతులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని
నిజామాబాద్: అధికారంలోకి వస్తే రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. రైతులకు ఆరోగ్య బీమా కల్పిస్తామని రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) కమ్మర్‌పల్లిలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రైతులతో రేవంత్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.5 లక్షలిస్తామని తెలిపారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని 6 నెలల్లో తెరిపిస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) మోడల్లో వ్యవసాయ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పారు. గుజరాత్ (Gujarat) మోడల్ అంటే ఇద్దరు అమ్మేటోళ్లు, ఇద్దరు కొనేటోళ్లేనని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ అంటే 3000 వైన్‌షాపులు, 60 వేల బెల్ట్ షాపులని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.