Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ‘రోబోటిక్స్‌ సెంటర్‌’ ప్రారంభం

ABN , First Publish Date - 2023-04-13T20:41:31+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లోని జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌లో గురువారం రోబోటిక్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీఓఈ)ను రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

Shamshabad Airport: ఎయిర్‌పోర్టులో ‘రోబోటిక్స్‌ సెంటర్‌’ ప్రారంభం

శంషాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport)లోని జీఎంఆర్‌ ఇన్నోవెక్స్‌లో గురువారం రోబోటిక్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌(సీఓఈ)ను రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ (Jayesh Ranjan) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్స్‌ సాంకేతికత వివిధ పరిశ్రమలను ఆకర్షిస్తోందన్నారు. ఆటోమేషన్‌ స్పేస్‌ (Automation Space), స్టార్టప్‌లు, ఇండస్ట్రీ ప్లేయర్లకు రోబోటిక్స్‌ సాంకేతికతను అభివృద్ధి చేసి జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఆ దిశగా మరిన్ని పెట్టుబడులను, నిపుణులను, ఆవిష్కరణలను ఆకర్శించాలనుకుంటోందన్నారు. సాంకేతికతను, వ్యాపారాన్ని ఏకం చేసి వినియోగించడంలో ఇన్నోవెక్స్‌ ముందుందని జయేశ్‌ కొనియాడారు. ఇది రాష్ట్రంలో కీలక టెక్‌ హబ్‌గా రూపొందుతుందని జయేశ్‌రంజన్‌ తెలిపారు.

Updated Date - 2023-04-13T20:41:31+05:30 IST