Janasena: కూకట్‌పల్లి బరిలో జనసేన.. ఇంతకీ అభ్యర్థి ఎవరంటే...
ABN , First Publish Date - 2023-11-07T08:59:22+05:30 IST
కూకట్‌పల్లి(Kukatpally) నియోజకవర్గం నుంచి జనసేన(Janasena) పార్టీ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి(Kukatpally) నియోజకవర్గం నుంచి జనసేన(Janasena) పార్టీ బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ ఈ టికెట్‌ను జనసేనకు కేటాయించినట్లు సోమవారం ప్రచారం జరిగింది. పార్టీ అభ్యర్థిగా ముమ్మారెడ్డి ప్రేమకుమార్(Mummareddy Premakumar)ను కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pavan Kalyan)తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌లు భేటీ అయ్యారు. అయితే, రాష్ట్రంలోని 30స్థానాల్లో తమ పార్టీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పవన్‌కల్యాణ్ వారిని కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి స్థానాలను జనసేన(Janasena) నాయకులు అడుగుతూ వస్తున్నారు. అయితే, ఈ మూడింటిలో కూకట్‌పల్లి సీటును ఇచ్చేందుకు బీజేపీ తాజాగా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఇదే ప్రాంతానికి చెందిన ప్రముఖ బిల్డర్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ బీజేపీ టికెట్‌ను ఆశిస్తూ ఆరునెలల క్రితం ఆ పార్టీలో చేరారు. ఈ టికెట్ జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలియడంతో ఆయన రెండు రోజుల క్రితం అనూహ్యంగా జనసేనలో చేరారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్.. ప్రేమకుమార్‌ను అభ్యర్థిగా కూడా నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ప్రేమకుమార్ అభ్యర్థిత్వం ఖరారైనట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన ఇంటికి అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.