TS News: మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2023-04-16T18:17:53+05:30 IST

మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

TS News: మంత్రి గంగుల కమలాకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చర్ల బూత్కూరులో మంత్రి గంగుల కమలాకర్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ వేదికపై నుంచి గంగుల కింద పడిపోయారు. ఎక్కువ మంది రావడం వల్ల సభా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మంత్రి సహా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్‌ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తోపాటు మేయర్ సునీల్ రావు పరామర్శించారు.

Updated Date - 2023-04-16T18:17:53+05:30 IST