Jagitial: హీటేక్కిస్తున్న ధర్మపురి రగడ

ABN , First Publish Date - 2023-04-10T07:53:17+05:30 IST

జగిత్యాల: ధర్మపురి (Dharmapuri) రగడ హీటేక్కిస్తోంది. స్ట్రాంగ్ రూమ్ (Strong Room) సోమవారం తెరుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం...

Jagitial: హీటేక్కిస్తున్న ధర్మపురి రగడ

జగిత్యాల: ధర్మపురి (Dharmapuri) రగడ హీటేక్కిస్తోంది. స్ట్రాంగ్ రూమ్ (Strong Room) సోమవారం తెరుచుకోనుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పోరాటం చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించారు. 2018లో అక్రమంగా కొప్పుల ఈశ్వర్ గెలిచారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఇవాళ స్ట్రాంగ్ రూమ్‌ను కలెక్టర్ తెరవనున్నారు.

2018 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయని.. ధర్మపురి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 441 ఓట్ల తేడాతో తాను ఓటమిపాలు కావడంతో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంను తెరవనున్నారు. అనంతరం అందులోని కీలక డాక్యుమెంట్లను నిర్ణిత తేదీలోగా హైకోర్టుకు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-04-10T07:53:17+05:30 IST