Revanth Reddy: ఇసుక దోపిడీపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2023-03-01T18:25:02+05:30 IST
మానేరు నది నుంచి అక్రమంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. లారీలు ఆపిన వారిపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరీంనగర్: మానేరు నది నుంచి అక్రమంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. లారీలు ఆపిన వారిపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడీపై ఈటల రాజేందర్, బండి సంజయ్ స్పందించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన ఈటల ఎక్కడికి వెళ్లారు? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం ఇసుక మాఫియాగా మారిందన్నారు.
నిన్న రేవంత్ రెడ్డి కార్నల్ మీటింగ్ లో ఏం జరిగిందంటే..?
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కార్నర్ మీటింగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. రేవంత్ రెడ్డి సభపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. రేవంత్‌రెడ్డి గోబ్యాక్ అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు (BRS workers) నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి రాళ్లు రువ్వారు. ఉద్రిక్తత మధ్య రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ కొనసాగింది. రేవంత్‌రెడ్డి మీటింగ్ జరిగే ప్రాంతానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. రేవంత్ రెడ్డిపై దాడికి సిద్ధమైన బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో కార్నర్ మీటింగ్ పక్కనే ఉన్న ఊర్వశి థియేటర్‌లో మోహరించారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను థియేటర్ నుంచి బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు.
ఇందిరమ్మ రాజ్యం వస్తే నే పేదల కష్టాలు తీరుతాయని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం క ల్పించాలని రేవంత్ కోరారు. సోమవారం నడికూడ మండలం కంఠాత్మకూరు, ధర్మారం, నడికూడ, పులిగిల్ల, రాయపర్తిలలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పరకాల మండలం పులిగిల్ల గ్రామంలోని సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి అక్కడినుండి హాథ్ సే హాథ్ జోడో యాత్రను 15వ రోజు పునఃప్రారంభించారు. పులిగిల్ల, రాయపర్తి, నర్సక్కపల్లి, మల్లక్కపేట మీదుగా యాత్ర పరకాలకు చేరుకుంది. పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.