Jagityala: సినిమా పక్కిలో దొంగలను పట్టుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-01-15T10:37:30+05:30 IST

జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలోని తండ్రియాల ఎస్‌బీఐ బ్యాంకు (SBI Bank) ఏటీఎం (ATM)లో భారీ చోరీ జరిగింది

Jagityala: సినిమా పక్కిలో దొంగలను పట్టుకున్న పోలీసులు

జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలోని తండ్రియాల ఎస్‌బీఐ బ్యాంకు (SBI Bank) ఏటీఎం (ATM)లో భారీ చోరీ జరిగింది. అయితే దొంగలను పోలీసులు సినిమా పక్కిలో పట్టుకున్నారు. ఏటీఎంలో డబ్బులు దోచుకుని వెళుతున్న దొంగల వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో రోడ్డుపై నోట్ల కట్టలు పడిపోయాయి. వెంటనే పోలీసులు బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. రోడ్‌పై పడిపోయిన డబ్బును స్వాధీనం చేసుకుని బ్యాంకు అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-01-15T10:37:33+05:30 IST