KBR Park: డిసెంబరు 1న కేబీఆర్ పార్కు సిల్వర్ జుబ్లీ వేడుకలు
ABN , First Publish Date - 2023-11-11T07:43:36+05:30 IST
కేబీఆర్ పార్క్(KBR Park) సిల్వర్ జుబ్లీ వేడుకలు డిసెంబరు 1న నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ పేర్కొంది.

- ప్రకృతి చిత్రాల ప్రదర్శన
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): కేబీఆర్ పార్క్(KBR Park) సిల్వర్ జుబ్లీ వేడుకలు డిసెంబరు 1న నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ పేర్కొంది. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కులో ప్రకృతి చిత్రాలను ప్రదర్శించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. జంతువులు, మొక్కలు, ప్రజలు, ప్రకృతి దృశ్యాలు, ఉద్వేగభరితమైన వన్యప్రాణులు తదితర అంశాలపై తీసిన ఫొటోలను ఈ నెల 28 లోపు జిల్లా అటవీశాఖ అధికారికి పంపించాలని సూచించింది. ఫొటో పంపేందుకు ఎఫ్‌ఆర్వో అనురాధ (9063986149)ను సంప్రదించాలని అటవీశాఖ సూచించింది.