Gaddar Last Rites : కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు
ABN , First Publish Date - 2023-08-06T21:49:40+05:30 IST
ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ (Gaddar) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయించింది. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు..
హైదరాబాద్ : ప్రజా గాయకుడు, యుద్ధనౌక గద్దర్ (Gaddar) అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయించింది. జీవితాంతం వారు చేసిన త్యాగాలు ప్రజా సేవకు గౌరవ సూచకంగా దివంగత గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు.. గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని (TS Govt CS) సీఎం ఆదేశించారు. తన జీవితకాలం ప్రజల కోసమే బతికిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ తెలంగాణ గర్వించే బిడ్డ అని సీఎం అన్నారు. మరోవైపు ఎల్బీ స్టేడియానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. గద్దర్ పార్థీవ దేహానికి నివాళులు ఆర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు మంత్రి. కాగా.. గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు, కవులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అంతిమ యాత్ర ఇలా..
సోమవారం ఉదయం 11 గంటలకు ఎల్బీ స్డేడియం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం
కళాకారులతో భారీ ర్యాలీగా వెళ్లనున్న గద్దర్ పార్థీవదేహం
అంతిమయాత్రలో పాల్గొననున్న కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు
ఎల్బీ స్టేడియం నుండి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు అంతిమయాత్ర
గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్థీవదేహం
కాసేపు అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో నివాళులు అర్పించనున్న కళాకారులు
అమరవీరుల స్థూపం నుంచి భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లనున్న పార్థివదేహం
భూదేవినగర్‌లోని మహాబోధి విద్యాలయం అవరణలో జరగనున్న గద్దర్ అంత్యక్రియలు