Home » Gaddar
తెలంగాణ ఉద్యమంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యమంలో ఆయన పాటలు ఎంతో ప్రత్యేకమని మాజీ మంత్రి చెప్పారు.
తనకు తెలంగాణ సాంస్కృతిక మండలి చైర్పర్సన్ పదవిని ఇవ్వడం తన తండ్రిని గౌరవించడమేనని గద్దర్ కూతురు వెన్నెల గద్దర్ పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సాంస్కృతిక, కళాప్రదర్శనలతో విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి నిర్దేశించిన తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్ గుమ్మడి వెన్నెలను ప్రభుత్వం నియమించింది.
సాధారణ పరిశీలకుల దృష్టిలో గద్దర్ ఒక పాట కవి, ఒక విప్లవ కవి. బహుజన ఉద్యమ కాలానికి మొదట పరోక్షంగా, తర్వాత ప్రత్యక్షంగా మద్దతిచ్చిన పోరాటశీలి. ఇంకా కొంచెం విస్తృతంగా పరిశీలన చేసిన వారి దృష్టిలో గద్దర్ 1980ల నుండి తెలుగు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సాంస్కృతిక విప్లవ సైనికుడు.
దివంగత ఉద్యమనేత, ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు మరో గౌరవం దక్కింది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులోని హల్దీవాగు లిఫ్ట్ ఇరిగేషన్‌కు... ‘గద్దర్ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్‌హౌ్‌స’గా నామకరణం చేశారు.
ఆటా, పాట, నటన, ప్రశ్నించేతత్వంతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది ప్రజాయుద్ధ నౌక గద్దర్ అయితే, ఇచ్చింది సోనియాగాంధీ అని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు.
సినిమా రంగంలో గద్దర్ అవార్డుల కోసం విధివిధానాలు, నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి.నర్సింగ్‌రావు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
‘తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు.. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ద నౌక.. గద్దర్’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు.
గద్దర్ ఆలోచనా విధానాన్ని తమ ప్రభుత్వం ఆచరిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గద్దర్‌ను విశ్వమానవుడిగా అభివర్ణిస్తూ ఆయన లాంటి వ్యక్తి శతాబ్దానికి ఒక్కరే పుడతారంటూ కీర్తించారు.
‘పొడుస్తున్న పొద్దు మీద’.. పాటై వెలిగిన సూరీడు అస్తమించాడు..! బండెనక బండి అంటూ గజ్జెకట్టిన గళం మూగబోయింది..! భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్లిపోయింది..!