Share News

Khammam: సీఎం రేవంత్‏రెడ్డి ఢిల్లీ పీఆర్వోగా దుద్దిపాళ్ల విజయ్‌కుమార్‌

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:35 AM

ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా పీఆర్వోగా మండల పరిధిలోని కొత్తకమలాపురానికి చెందిన దుద్దిపాళ్ల విజయకుమార్‌

Khammam: సీఎం రేవంత్‏రెడ్డి ఢిల్లీ పీఆర్వోగా దుద్దిపాళ్ల విజయ్‌కుమార్‌

కారేపల్లి(ఖమ్మం): ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియా పీఆర్వోగా మండల పరిధిలోని కొత్తకమలాపురానికి చెందిన దుద్దిపాళ్ల విజయకుమార్‌(Duddipalla Vijayakumar) నియమితులయ్యారు. ఈసందర్భంగా బుదవారం సీఎస్‌ శాంతకుమారి నియామక ఉత్తర్వులను జారీచేశారు. కొత్తకమలాపురానికి చెందిన చిన్నకారు రైతు దుద్దిపాళ్ల భాస్కర్‌రావు కుమారుడైన విజయకుమార్‌ 17సంవత్సరాలుగా ఓ దినపత్రికలో చేస్తున్నాడు. ఖమ్మం(Khammam) జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల పాటు పని చేశాడు. ఐదు సంవత్సరాల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాలతో ఢిల్లీ పీఆర్వోగా విజయ్‌ కుమార్‌ను నియమించుకున్నారు. ఈసందర్బంగా మండలానికి చెం దిన విజయ్‌కుమార్‌ ఢిల్లీలో సీఎంకు పీఆర్వోగా నియమితులు కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:35 AM