Khammam: కేటీఆర్.. మీకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే.. ఆ సంగతి గుర్తుంచుకోండి...
ABN , First Publish Date - 2023-09-27T13:05:09+05:30 IST
‘‘మీకు.. మీనాన్నకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీనే అన్నది గుర్తుంచుకోండి... నాడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హైదరాబాద్‌లో
- కేటీఆర్ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం
ఖమ్మం: ‘‘మీకు.. మీనాన్నకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీనే అన్నది గుర్తుంచుకోండి... నాడు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) హైదరాబాద్‌లో వేసిన పునాదులపైనే మీరు పరిపాలిస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. యావత్ ప్రపంచం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తుంటే మీరేమే ఆయనపై వ్యాఖ్యలు చేయడం హేయనీయమని ’’ టీడీపీ నాయకులు కేతినేని హరీష్, కొండబాల కరుణాకర్, మల్లెంపాటి అప్పారావు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. నారాచంద్రబాబు నాయుడుపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లో విజన్ 2020 పేరుతో చేసిన అభివృద్ధి ఫలాలలే ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. ఐటీరంగానికి చంద్రబాబు నాయుడు వేసిన పునాదులపై నేడు పరిపాలన చేసుకుంటూ ఆయనను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కే సీఆర్ కు రాజకీయ భిక్షపెట్టింది అన్న ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ అని గుర్తుచేశారు. టీడీపీ పెట్టిన భిక్షతో రాజకీయంగా ఎదిగి ఆ పార్టీ పైనా చంద్రబాబు నాయుడుపైనా విమర్శలు చేయడం కేటీఆర్ విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశంతో పార్టీలో ఎదిగిన మీరు మీకు పెట్టిన పేరు కూడా ఎన్టీఆర్‌దే నని గుర్తుంచుకోవాలన్నారు. సైకో జగన్‌తో చీకటి ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణ నిరసనలపై లాఅండ్ ఆర్డర్ సమస్య అనడం ఎంత వరకు సమజసం అన్నారు. సీఎం కేసీఆర్ ఆంధ్రాలో, మహారాష్ట్రలో రాజకీయం చేయడం లేదా.. అఆంటి ఉమ్మడి తెలుగురాష్ట్ర భవిష్యత్తు కోసం కృషిచేసిన మహా మనిషీని అరెస్ట్ చేస్తే స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ వ్యాఖ్యలను గమనిస్తున్నారని అన్నారు. ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాగార్జునపు శ్రీను, కన్నేటి పృథ్వి, అశోక్ వెంకన్న తదితరులున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు : కూరపాటి
మాజీ మంత్రి టీడీపీ జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, ఆ తర్వాత జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండనీయమని టీడీపీ ఖమ్మం నియోజకవర్గం ఇన్‌చార్జి కూరపాటి వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను యావత్ ప్రపంచం వ్యతిరేఖిస్తుంటే కేటీఆర్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారి రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు.