ఫిబ్రవర్ 4న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్
ABN , First Publish Date - 2023-02-03T18:52:23+05:30 IST
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం మున్సిపల్ ఆఫీస్‌లో గ్రేస్ సర్వీస్ సొసైటీ, గ్రేస్ క్యాన్సర్ పౌండేషన్ సంయుక్తంగా ఫిబ్రవరి 4న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్...
ఖమ్మం: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం (Khammam) మున్సిపల్ ఆఫీస్‌లో గ్రేస్ సర్వీస్ సొసైటీ, గ్రేస్ క్యాన్సర్ పౌండేషన్ సంయుక్తంగా ఫిబ్రవరి 4న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్ (Cancer Screening Campaign) ప్రారంభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం మేయర్ పి.నీరజ, గౌరవ అతిథిగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి పాల్గొంటారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా శానిటేషన్ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు..?
నేటి జీవనశైలి, ఇతర కారణాల వల్ల వల్ల చాలామంది మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాంటివారికి ఏమైనా ఇబ్బంది ఉంటే గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుంది. కానీ కొందరు మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) సందర్భంగా ఖమ్మం మున్సిపల్ ఆఫీస్‌లో ఇందుకు సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు. మహిళల్లో గర్భాశయానికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు తెలిపారు. అయితే మామూలుగా సంతానం కలిగిన అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత గర్భాశయానికి కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల అది గర్భశయక్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో వారికి తెలియకుండానే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.