Bhatti Vikramarka: గోదావరి వరద దుస్థితికి మంత్రి అజయ్ నిర్లక్ష్యమే కారణం

ABN , First Publish Date - 2023-07-29T14:49:42+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరి వరద దుస్థితికి మంత్రి అజయ్ అశ్రద్ద నిర్లక్ష్యం కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేశారు.

Bhatti Vikramarka: గోదావరి వరద దుస్థితికి మంత్రి అజయ్ నిర్లక్ష్యమే కారణం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి వరద దుస్థితికి మంత్రి అజయ్ అశ్రద్ద నిర్లక్ష్యం కారణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (CLP Leader Bathi Vikramarka) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి వరదలపై మంత్రి రివ్యూ చేయలేదని.. ముఖ్యమంత్రి కూడా పాలన గాలికొదిలేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ను దేశమంతా విస్తరించాలనే రాజకీయ ఆలోచన తప్ప ప్రజా సమస్యలు పట్టింపు లేదన్నారు. కేసీఆర్‌ వాగ్దానం చేసిన వెయ్యి కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరకట్ట నిర్మాణం కోసం ఎమ్మేల్యే పోదేం వీరయ్య ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా వాని తప్పిదం వల్లే వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. రామాలయం వంద కోట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలన గుర్తుచేయడం కోసమే ఎమ్మేల్యే పోదెం వీరయ్య పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 55.10 అడుగుల వద్ద 15,40,412 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి వద్ద ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Updated Date - 2023-07-29T14:49:42+05:30 IST