Bhatti Vikramarka: ఇవి గాలి లెక్కలు కాదు.. రికార్డ్స్‌లో ఉన్నదే చూపిస్తున్నాం
ABN , Publish Date - Dec 30 , 2023 | 04:00 PM
Telangana: బీటీపీఎస్‌ను పరిశీలించడానికి, అవగాహన చేసుకోవడానికి, రివ్యూ రూపేనా తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ సెక్టార్‌ను గత ప్రభుత్వం అప్పుల ఊబిగా మార్చిందని విమర్శించారు.
భద్రాద్రి కొత్తగూడెం: బీటీపీఎస్‌ను పరిశీలించడానికి, అవగాహన చేసుకోవడానికి, రివ్యూ రూపేనా తెలుసుకున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikrmarka) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..విద్యుత్ సెక్టార్‌ను గత ప్రభుత్వం అప్పుల ఊబిగా మార్చిందని విమర్శించారు. అన్ని శాఖలలో అంది వచ్చిన కాడికి అప్పులు చేసిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.81514 కోట్ల అప్పులు చేసిందన్నారు. ప్రభుత్వం నుండి డిస్కంలకు రూ.28000 కోట్ల బకాయి పడి ఉన్నామన్నారు. తాము ఉంటేనే కరెంట్ సాధ్యం అని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందన్నారు. విద్యుత్ కొనడానికి 30 వేలకోట్ల రూపాయల 59580 కోట్ల పవర్ పరిచేజ్ మీద అప్పు చేసిందన్నారు. రాష్ట్ర విబజన నాటికి రూ.7250 కోట్ల బకాయి మాత్రమే ఉందన్నారు.
యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు రూ.50000 కోట్ల అప్పు ఉందన్నారు. వాస్తవాలు అన్నీ కూడా అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశామన్నారు. అప్పుల నుంచి విముక్తులై గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇవన్నీ గాలి లెక్కలు కాదని చెప్పుకొచ్చారు. ఉన్నరికార్డ్స్ ప్రకారం అందిస్తున్నట్లు తెలిపారు. పవర్ సెక్టార్‌ను గత ప్రభుత్వం పీకలదాకా ముంచేయగా.. ఈ ప్రభుత్వం ఈ అప్పుల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తుందన్నారు. బీటీపీఎస్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హని కలుగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామన్నారు. ఇప్పుడున్న బీటీపీఎస్ వలన చాలా ఇబ్బందులు ఉన్నాయని...దీనిని అధిగమించే ప్రయత్నం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...