Khammam: ఆ కాలేజీ ముందు ధర్నా.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-03-02T17:43:39+05:30 IST

గ్రామపంచాయతీకి పన్నులు చెల్లించడంలేదని ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలముందు

Khammam: ఆ కాలేజీ ముందు ధర్నా.. ఎందుకంటే..?

ఖమ్మం (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీకి పన్నులు చెల్లించడంలేదని ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో ఓ ఇంజనీరింగ్ కళాశాలముందు పంచాయతీ కార్యదర్శి, గ్రామసర్పంచ్ ధర్నాకు దిగారు. కళాశాల గేటు ముందు టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీకి చెల్లించాల్సిన పన్నులు (Tax) చెల్లించకుండా మహ్మదీయ కళాశాల యాజమాన్యం (College Management)నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రూ.55లక్షల ఆస్తిపన్ను బకాయిలు కళాశాల యాజమాన్యం గ్రామపంచాయతికి బకాయి ఉందని..ఎన్సిసార్లు అడిగినా యాజమాన్యం సమాధానం చెప్పడం లేదని, కనీసం కాలేజీ ఆవరణలోకి కూడా రానివ్వడంలేదని వాపోయారు. చేసేదేమీ లేక మార్చి2న కళాశాల గేటుకు తాళం వేశామన్నారు. అయిన యాజమాన్యం స్పందించకపోవడంతో ధర్నాకు దిగారు. అధికారులు స్పందించి కళాశాల యాజమాన్యం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.o

Updated Date - 2023-03-02T18:20:04+05:30 IST