Share News

Minister Ponguleti: అధికారులను వేధించటానికి సమీక్ష చేయలేదు

ABN , Publish Date - Dec 18 , 2023 | 01:10 PM

ఖమ్మం జిల్లా: అభివృద్ది, సంక్షేమంపై రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..

Minister Ponguleti: అధికారులను వేధించటానికి సమీక్ష చేయలేదు

ఖమ్మం జిల్లా: అభివృద్ది, సంక్షేమంపై రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిద్దిద్దటమే కాకుండా ప్రజలకు మెరుగైన సేవలందాలని అధికారులను కోరానన్నారు. అధికారులను వేధించటానికి సమీక్ష చేయలేదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రెండ్లీ ప్రభుత్వమని అన్నారు. ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఉద్యోగులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, ఎవరైతే ప్రజాధనం దోపిడీ చేశారో.. ప్రభుత్వ భూములు ఆక్రమించారో.. వాటన్నిటిపై సమీక్షలు చేసి సరిదాద్దుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలు రంకెలేస్తున్నారని, ఇంకా అధికారంలోనే ఉన్నామని కలలు కంటున్నారని, భ్రమపడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రతిపక్ష పార్టీ నేతలకు చెబుతున్నా.. మీలా మాయమాటలు చెప్పం.. మీలా ప్రజలను మోసం చేయం.. ధనిక రాష్ట్రం తెలంగాణను గత ప్రభుత్వం కొల్లగొట్టింది.. ఖజానా ఖాళీ చేసింది..’’ అని మండిపడ్డారు.

ఇది ఇందిరమ్మ రాజ్యమని, ప్రజా రాజ్యమని, జర్నలిస్టులకు తప్పని సరిగా న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సామాన్య ప్రజలకు అభివృద్ది ఫలాలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ఇల్లు లేని వ్యక్తి ఉండకూడదన్నదే తమ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించబోతున్నామని, ధరణి పేరుతో జరిగిన దోపిడీని బట్టబయలు చేసి నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, ధరణిని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Dec 18 , 2023 | 01:10 PM