Sandravenkata Veeraiah: సత్తుపల్లి అభ్యర్థిని ప్రకటించే దమ్ము ఉందా?.. పొంగులేటిపై సండ్ర ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-07-24T13:21:07+05:30 IST

కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Sandravenkata Veeraiah: సత్తుపల్లి అభ్యర్థిని ప్రకటించే దమ్ము ఉందా?.. పొంగులేటిపై సండ్ర ఘాటు వ్యాఖ్యలు

ఖమ్మం: కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై (Congress Leader Ponguleti Srinivas reddy) ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (MLA Sandra Venkata Veeraiah) ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2023కు ముందు తెలంగాణ రాష్ట్రంలో కనిపించిన అభివృద్ది... 2023 జనవరి నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కనిపించడం లేదా? అంటూ ప్రశ్నించారు. ‘‘ఏ అధికారం లేని నువ్వు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎస్కార్ట్ వాడావు?. ఏ అధికారం ఉందని నిన్ను కేసీఆర్, కేటీఆర్‌లు హెలికాప్టర్‌లో తిప్పారు? .. ఏ అధికారం ఉందని నీ ఇంటి ముందు గార్డ్స్‌ను పెట్టుకున్నావు, నలుగురు గన్ మెన్‌లను వాడావు?... ఇన్ని అనుభవించిన నువ్వు నన్ను దొర అనడం హాస్యాస్పదం?.. దళితులు ఎవ్వరూ వ్యాపారాలు చేయకూడదా?.. నువ్వు మాత్రమే వ్యాపారాలు చెయ్యాలా?. దళితులు ఎదిగితే ఓర్వలేవా ఎందుకు నీకింత అహంకారం. సత్తుపల్లిలో నాలుగు కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్‌లు తీసేసి ఒకటి పెట్టీ నడిపించగల సత్తా ఉందా. కేసీఆర్ నన్ను సత్తుపల్లి అభ్యర్ధిగా ప్రకటించారు. నీకు నీ అభ్యర్థిని ప్రకటించే దమ్ము ఉందా’’ అంటూ సండ్ర వెంకట వీరయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-07-24T13:21:07+05:30 IST