Ponguleti Srinivasa Reddy : పొంగులేటి రూం కీస్ కోసం వెయిట్ చేస్తున్న ఐటీ అధికారులు..
ABN , First Publish Date - 2023-11-10T10:03:05+05:30 IST
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 17లో ఉన్న 222/a ఇంట్లో, పొంగులేటి బంధువు నంద గిరి హిల్స్‌లోని బంధువు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.
ఖమ్మం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్10లో ఉన్న రాఘవ ప్రైడ్ ఆఫీస్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 17లో ఉన్న 222/a ఇంట్లో, పొంగులేటి బంధువు నంద గిరి హిల్స్‌లోని బంధువు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంట్లో అన్ని రూమ్స్ చెక్ చేసి డాక్యుమెంట్స్‌ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి రూం కీస్ లేక పోవడంతో నిన్నటి నుంచి ఐటీ అధికారులు కీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే కీస్ మేడం వద్ద ఉన్నాయని వాచ్మెన్ చెప్పాడు. పొంగులేటి రూంని సెర్చ్ చేయాలని కీస్ కావాలని ఐటీ అధికారులు ఆయన సతీమణిని ఫోన్లో అడిగినట్టు సమాచారం.