TS CPI: సీఎం కేసీఆర్ తీరుపై లెఫ్ట్ పార్టీల కన్నెర్ర

ABN , First Publish Date - 2023-08-21T16:48:20+05:30 IST

మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో వామపక్ష పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదే పొత్తు సాధారణ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని లెఫ్ట్ పార్టీలు భావించాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ వ్యవహారమే వామపక్షాలకు ఆగ్రహం తెప్పించింది.

TS CPI: సీఎం కేసీఆర్ తీరుపై లెఫ్ట్ పార్టీల కన్నెర్ర

భద్రాద్రి కొత్తగూడెం: సీఎం కేసీఆర్ (CM Kcr) తీరుపై వామపక్ష పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారు. మునుగోడు పొత్తు ధర్మం మరిచారంటూ కేసీఆర్‌పై కన్నెర్ర చేస్తున్నారు. మునుగోడులో జరిగిన ఉపఎన్నికల్లో వామపక్ష పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదే పొత్తు సాధారణ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని లెఫ్ట్ పార్టీలు భావించాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ వ్యవహారమే వామపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశం అవుతుందని ఆ పార్టీ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashivarao) తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే సోమవారం 115 మందితో కూడిన బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టారు. రెడ్లు-40, వెలమా-12 , వైశ్య-1, బ్రాహ్మణ-2, కమ్మ-4 , ఎస్సీ, ఎస్టీలకు-29, మైనారిటీ-3, బీసీ-24 సీట్లు ఇచ్చారు.

Updated Date - 2023-08-21T16:48:20+05:30 IST