Share News

Minister Tummala..కమ్మ కులం తల వంచే పని చేయను

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:46 PM

భద్రాద్రి కొత్తగూడెం: కమ్మ జాతి చరిత్ర గర్వ కారణమని, పౌరుషం దాతృత్వం కలిగిన కమ్మ జాతి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Minister Tummala..కమ్మ కులం తల వంచే పని చేయను

భద్రాద్రి కొత్తగూడెం: కమ్మ జాతి చరిత్ర గర్వ కారణమని, పౌరుషం దాతృత్వం కలిగిన కమ్మ జాతి దేశం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన శ్రీ సీతారామ కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్మాణం చేసిన నూతన వసతి గృహాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమ్మ జాతికి ఎవరి దయ దాక్షిణ్యాలు అవసరం లేదని, తల వంచే జాతి కాదని, నేలను నమ్ముకున్న జాతి కమ్మ జాతి అని అన్నారు.

ఏ రంగంలో చూసినా కమ్మ జాతి ఇతర కులాల అభివృద్ధిలో పాటు పడతామని, కమ్మ కులం తల వంచే పని చేయనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో మంత్రి పదవి దక్కిందన్నారు. శ్రీ రాముడు నడయాడిన పుణ్య భూమి అభివృద్ధికి తన జీవితం అంకితం చేస్తానన్నారు. ఉగాది నాటికి రెండో వారధి పూర్తి చేస్తామన్నారు. తన రాజకీయ లక్ష్యం.. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, పొట్ల నాగేశ్వరరావు, కొండబాల, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 12:46 PM