Share News

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్.. కేసీఆర్‌ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2023-10-18T11:41:27+05:30 IST

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పి బీఆర్‌ఎస్‏ను అంతమొందించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన కామెంట్స్.. కేసీఆర్‌ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాలి

బౌద్ధనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పి బీఆర్‌ఎస్‏ను అంతమొందించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. మంగళవారం రాత్రి బౌద్ధనగర్‌ జామైఉస్మానియా గార్డెన్‌లో సికింద్రాబాద్‌ కన్వీనర్‌ కందాడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ పోలింగ్‌బూత్‌, ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయనతో పాటు, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు లేవని, పేదప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వలేదని, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజాప్రభుత్వం రావాలని, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కోసం మనమంతా కృషి చేయాలన్నారు. రాబోయే నలభై రోజుల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల మద్దతు కూడగట్టాలన్నారు. నవంబర్‌ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం ప్రతినాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. తెలంగాణలో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమేయర్‌ బండకార్తీకారెడ్డి, రాష్ట్ర నాయకుడు వెంకటరమణి, బీజేపీ మహంకాళి సికింద్రాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, ఉపాధ్యక్షుడు రాచమల్ల కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యవర్గసభ్యులు పి.రవిప్రసాద్‌గౌడ్‌, బండపెల్లి సతీష్‌, ఆదం విజయకుమార్‌, నాయకులు బండచంద్రారెడ్డి, ప్రభుగుప్తా, కనకట్ల హరి, గణే్‌షముదిరాజ్‌, డివిజన్‌ అధ్యక్షులు హన్మంతముదిరాజ్‌, అంబాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

eeee.jpg

Updated Date - 2023-10-18T11:41:27+05:30 IST