Mainampally: ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం ఖాయం
ABN , First Publish Date - 2023-10-11T10:54:14+05:30 IST
మాయ మాటలతో మభ్యపెడుతున్న బీఆర్ఎస్(BRS) పాలనకు చరమగీతం పాడటానికి తెలంగాణ ప్రజలు ఆసిక్తితో ఎదురుచూస్తున్నారని
అల్వాల్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మాయ మాటలతో మభ్యపెడుతున్న బీఆర్ఎస్(BRS) పాలనకు చరమగీతం పాడటానికి తెలంగాణ ప్రజలు ఆసిక్తితో ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు(MLA Mainampally Hanumantha Rao) అన్నారు. అల్వాల్‌లో మంగళవారం కాంగ్రెస్ వాదుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను ఈసారి ప్రజలు గెలిపించడానికి సిద్ధమవుతున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియమాకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కొందరికే బంగారు బాతుగా మారిందన్నారు. కోట్లాది రూపాయలను అప్పులు తెచ్చి సామా న్య ప్రజలపై రుద్దుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ఆయన ప్రజలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా పార్టీలకు చెందిన పలువురు పెద్ద ఎత్తున మైనంపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒక ఐఖ్యమత్యంతో ఉండి కాంగ్రెస్ పార్టీతని భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్పొరేటర్ రాజ్‌జితేందర్‌నాథ్, నిమ్మ అశోక్‌రెడ్డి, కృష్ణాగౌడ్, సంతోష్‌రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఉధయ్, రాజసింహ్మారెడ్డి, నాగేశ్వర్రావు, శివకుమార్, వీన్సమేరీ, పద్మ, జ్యోతి, శకుంతలనాయుడు తదితరులు పాల్గొన్నారు.