Free Bus: మగజాతి ఆణిముత్యం.. బస్సులో సీట్ల కోసం యువకుడి నిరసన
ABN , Publish Date - Dec 16 , 2023 | 07:15 PM
Free Bus: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్టాండ్ దగ్గర శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో తమకు సీట్లు దొరకడం లేదని.. మహిళల తరహాలో మగవాళ్లకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మీ పథకం కింద ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పైసా ఖర్చు లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు. సీట్లు దొరక్కపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరో బస్సు కోసం వేచిచూసే సమయం లేక ఉన్న బస్సులోనే నిలబడి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
అయితే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్టాండ్ దగ్గర శనివారం మధ్యాహ్నం ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో తమకు సీట్లు దొరకడం లేదని.. మహిళల తరహాలో మగవాళ్లకు కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బస్సులో 30 సీట్లు ఉంటే 20 సీట్లు మహిళలకు.. 10 సీట్లు మగవాళ్లకు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సదరు యువకుడు కోరాడు. ఉన్న సీట్లన్నీ ఆడవాళ్లకే కేటాయిస్తే మగవాళ్లు ఎక్కడ కూర్చోవాలని నిలదీశాడు. దీంతో అతడిని మగజాతి ఆణిముత్యం అంటూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.