BRS: మహారాష్ట్ర నుంచి భారత రాష్ట్ర సమితిలోకి వలసల పర్వం
ABN , First Publish Date - 2023-04-10T22:05:44+05:30 IST
భారత్ రాష్ట్ర సమితిలో (BRS) చేరికల పర్వం కొనసాగుతోంది.
హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిలో (BRS) చేరికల పర్వం కొనసాగుతోంది. మహారాష్ట్ర (Maharashtra) సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకులు శంకర్న ధోంగే నేతృత్వంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) సమక్షంలో గులాబి కండువాలు కప్పుకొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్సీపి రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ సలుంఖే, మాజీ ఎమ్మెల్యే సంగీత వి థోంబరే భర్త విజయ్ థోంబరే, ముఖేడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నానాసాహెబ్ జాదవ్, జెడ్పీ మెంబర్ శివ మొహోద్, మాజీ సభాపతి సుశీల్ ఘోటె, మాజీ జెడ్పీ మెంబర్ దేవానంద్ మూలె, నాందేడ్ కార్పోరేటర్ శ్రీనివాస్ జాదవ్, శివ్ సంగ్రామ్ పార్టీ నుండి కచ్రే సహేద్, ఎ బీడ్ నుంచి అమర్ షిండే బీఆర్ఎస్‌లో చేరారు.
పిఎంసి మొతాలా జిల్లా బుల్ధానా ప్రెసిడెంట్, శివ్ సంగ్రామ్ పార్టీ ప్రెసిడెంట్ పంజాబ్ రావ్ దేశ్ ముఖ్, శివ్ సంగ్రామ్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ శైలేష్ సర్కేట్, ఎంఎన్ఎస్ లాతూర్ జిల్లా ప్రెసిడెంట్ ద్నీనేశ్వర్ జగ్డేల్, బీడ్ జిల్లా శివ్ సంగ్రామ్ పార్టీ జనరల్ సెక్రటరీ సునీల్ అర్సుల్, శివ్ సంగ్రామ్ పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కమలాకర్ థోరట్, బీడ్ జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ దీపక్ షిండే, లాతూర్ జిల్లా తాలూకా ఎన్సీపి ప్రెసిడెంట్ ఆదిత్య దేశ్ ముఖ్, బీడ్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ సోమవంశీ, లాతూర్ జెడ్పీ మెంబర్ వ్యంకట్రావ్ జాదవ్, ధరూర్ జిల్లా బీడ్ తాలూకా బిజెపి ప్రెసిడెంట్ మహేష్ సోలంకె, బీడ్ జిల్లా అంబజోగయ్ తాలూకా భావ్ థానా సర్పంచ్ శివ్ లింగ్ యాదవ్, సామాజిక కార్యకర్తలు ఇంద్రజిత్ మోరే, ధనంజయ్ మసాల్, సిద్ధేశ్వర్ థోనగే తదితరులు బీఆర్ఎస్‌లో చేరారు.