Raghunandan rao: విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయి

ABN , First Publish Date - 2023-08-14T15:54:28+05:30 IST

1947, ఆగస్టు 14న దేశ విభజనకు నిర్ణయం తీసుకున్న రోజు. ఆంగ్లేయులు ఈ దేశం బాగుంటే ఎప్పటికైనా పోటీ అవుతుందన్న దురుద్దేశంతో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతో తోటి మతం పేరిట హిందూస్తాన్, పాకిస్తాన్ అని విభజించారు.

Raghunandan rao: విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయి

సిద్దిపేట జిల్లా: విభజన గాయాల స్మృతి దినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు మూతికి నల్ల గుడ్డలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (Dubbaka mla raghunandan rao), జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడారు. ‘‘1947, ఆగస్టు 14న దేశ విభజనకు నిర్ణయం తీసుకున్న రోజు. ఆంగ్లేయులు ఈ దేశం బాగుంటే ఎప్పటికైనా పోటీ అవుతుందన్న దురుద్దేశంతో డివైడ్ అండ్ రూల్ అనే పాలసీతో తోటి మతం పేరిట హిందూస్తాన్, పాకిస్తాన్ అని విభజించారు. నేటికీ స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఆ పాలసీ కొనసాగిస్తున్నారు. ఆనాటి గాయాలు నేటి తరానికి చూపేట్టాలని నేడు ఫొటోల రూపేణ, వస్తు రూపేణ, ఎగ్జిబిషన్ రూపేణ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దేశంలోని 736 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి దేశాన్ని విచ్ఛిన్నం చేసిన కారకులు ఎవరు?, మతం పేరిట చేసిన అనర్ధాలు ఏమిటి అని భావితరాలను జాగృతం చేస్తున్నాం.’’ అని రఘునందర్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-08-14T15:54:28+05:30 IST