Eetela Rajender:గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌పై కసిగా ఉన్నారు: ఈటల
ABN , First Publish Date - 2023-11-05T19:46:17+05:30 IST
గజ్వేల్(Gajwel)లో సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetela Rajender:) అన్నారు. గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 7న గజ్వేల్ లో, 9న హుజూరాబాద్ లో తాను నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
గజ్వేల్: గజ్వేల్(Gajwel)లో సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetela Rajender:) అన్నారు. గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 7న గజ్వేల్ లో, 9న హుజూరాబాద్ లో తాను నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ప్రజా ఆశీర్వాదంతో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో కేసీఆర్ బాధితులు ఉన్నారని.. కేసీఆర్(CM KCR) కి బుద్ధి చెప్పే టైం వచ్చిందని విమర్శించారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు రాక.. నిరుద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరు మీద లాక్కున్న భూములకు ఇంతవరకు పరిహారం అందించలేదని ఈటల అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ప్రైవేటు కంపెనీల కోం పేదల భూములు లాక్కొన్ని కేసీఆర్ సర్కార్ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోంది. ప్రాజెక్టుల వద్ద టూరిజం పేరుతో మళ్లి భూముల్ని లాక్కుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే లాక్కున్న భూములన్నీ తిరిగి ఇచ్చేస్తాం. రైతుల నుంచి భూముల్ని లాక్కుని అందులో వారినే కూలీలుగా మారుస్తున్నారు.మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తానని వారి కోసం కంపెనీలు ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదు. కేసీఆర్ ను మళ్లీ గెలిపిస్తే ప్రజల బతుకులు ఆగం అవుతాయి" అని ఈటల హెచ్చరించారు.