Harishrao: మహిళల ముందడుగులో కలిసికట్టుగా కృషి చేద్దాం
ABN , First Publish Date - 2023-03-08T10:04:27+05:30 IST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వద్ద 5 కే రన్ నిర్వహించారు.
సిద్దిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Womens Day) సందర్భంగా సిద్దిపేట పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో సిద్దిపేట డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వద్ద 5 కే రన్ నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు(Minister Harish Rao) 5 కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం (Telangana State) అన్ని రంగాల్లో తెలంగాణకు దిక్సూచిగా ఉందన్నారు. మహిళల భాగస్వామ్యం విద్యలో, ఉద్యోగాల్లో, పారిశ్రామిక రంగంలో ఇలా అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. మహిళల ముందడుగులో మనమంతా కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ఆత్మవిశ్వాసంతో కదిలితే మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా మనమెంచుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతామన్నారు. మహిళల ప్రగతి పరుగుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. మహిళలంతా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకుంటూ మహిళలందరికి మంత్రి హరీష్‌రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీ శ్వేతా, జిల్లా న్యాయమూర్తి రఘురాం హాజరయ్యారు. 5 కే రన్‌లో పెద్దఎత్తున విద్యార్థినిలు పాల్గొన్నారు.