Home » Siddipet
సాంకేతికత అత్యున్నత దశలో ఉన్న నేటి కాలంలో ప్రతీదీ డిజిటలైజేషన్ అయిపోతోంది.
బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేసుకుని దేశ రాజకీయాల్లో కీలకంగా నిలవాలని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ అని, పార్లమెంట్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతోందని కేసీఆర్ చెప్పారు.
గత ప్రభుత్వం (బీఆర్ఎస్) చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తోందని, ఎస్ఆర్ఎస్పీ నీరు తగ్గినా కూడా కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశామని హరీష్ రావు చెప్పారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
సిద్దిపేట నియోజకవర్గంలో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, మిడ్ మానేరు నుంచి రంగనాయక సాగర్లోకి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు.
జయహో మల్లన్న.. మమ్మేలు మల్లన్న.. కొమురెల్లి మల్లన్న.. అంటూ భక్తుల జయజయధ్వానాలతో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాలు మార్మోగాయి. మల్లన్న పెద్దపట్నం గురువారం తెల్లవారు జామున కన్నుల పండువగా జరిగింది.
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేవయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దేవయ్య బయాలజీ టీచర్.
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి ఒకరు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శివాజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జెబ్బాపూర్ గ్రామంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని ఆయన పేర్కొన్నారు.
లక్ష సూర్య నమస్కారాలు చేయడం లక్ష్యం కాగా 4,02,154 సూర్య నమస్కారాలు చేసి యోగ సాధకులు రికార్డు నెలకొల్పారు. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్లో ఈ రికార్డు నమోదైంది. 1,484 మంది యోగ సాధకులు పాల్గొన్నారు.