Minister Harish Rao: కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు..

ABN , First Publish Date - 2023-04-17T16:23:48+05:30 IST

సిద్ధిపేట: ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలు బీఆర్ఎ (BRS)పై నీలపానిందలు వేస్తున్నాయని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు.

Minister Harish Rao: కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు..

సిద్ధిపేట: ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీలు బీఆర్ఎ (BRS)పై నీలపానిందలు వేస్తున్నాయని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సోమవారం సిద్దిపేట, మిట్టపల్లిలో అర్బన్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం (Kaleswaram) లేకుంటే ఇన్ని లక్షల ఎకరాలు ఎలా పారేదన్నారు. ఢిల్లీలో గాంధీ భవన్‌లో కూర్చొని కాళేశ్వరం దండగా అంటే.. అన్నవాళ్లను తీసుకొచ్చి కాళేశ్వరం కాలువలో ముంచితే పండగో.. దండగో తెలుస్తుందన్నారు. కేసీఆర్ (KCR) లేకుంటే తెలంగాణ (Telangana) రాష్ట్రం వచ్చేది కాదని, జిల్లా ఏర్పాటు అయ్యిది కాదని, ప్రాజెక్టులు నిర్మాణం అయ్యివి కాదన్నారు.

అర్బన్ మండలం సిద్దిపేటకు హైటెక్ సిటీ అయిందని, అభివృద్ధిలో ఈ మండలం దూసుకుపోతుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మిట్టపల్లి నుంచి సిద్దిపేట వరకు పోర్ లైన్‌తో పాటు రంఘదాంపల్లి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు 30 కోట్ల వడ్లు పండితే నేడు 300 కోట్ల వడ్లు పండుతున్నాయని, రాష్ట్రంలో 27వేల కోట్ల వడ్లు పండుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఆకలి చావులు, అంబలి కేంద్రాలు లేవని, సీఎం కేసీఆర్ రైతును బలోపేతం చేశారని, అందుకే భూమి విలువ పెరిగిందన్నారు.

నాటి కాంగ్రెస్ పార్టీకి నేటి బీఆర్ఎస్ పార్టీకీ పొంతన లేదని, మన అభివృద్ధి తెరిచిన పుస్తకంలా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. కళ్యాణ లక్ష్మి రాకముందు బాల్యవివాహాలు జరిగేవని, 9 ఎండ్ల బీజేపీ ప్రభుత్వంలో ఏ ఒక్క మంచి పని చేయలేదని, ధరలు పెంచడం, అమ్మడం తప్ప ఎం చేయలేదని విమర్శించారు. బీజేపీవన్నీ పడగొట్టే పనులు అయితే కేసీఆర్‌వి నిలబెట్టే పనులన్నారు. ఎమ్మెల్యేను కొనడం, ప్రభుత్వాలను పడగొట్టడం, ఈడీలను పంపడం తప్ప ఎం లేదన్నారు. బండి సంజయ్ మాటలు, బూతులు తప్ప రైతులపై ప్రేమ లేదని, బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలు తప్ప ఎం లేదని విమర్శించారు. ఆంధ్ర నాయకులు ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం జాతీయ హోదా కోసం పోరాడాలని.. తమపై కాదన్నారు. ఆంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడనేతప్ప.. అక్కడి ప్రజలను విమర్శించలేదన్నారు. తన చివరి శ్వాస వరకు సేవ చేస్తానని.. తన జీవితం సిద్దిపేట ప్రజలేకే అంకితమని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-17T16:23:48+05:30 IST