Share News

KTR: సింగరేణి ప్రైవేటుపరం చేయాలని ప్రధాని మోదీ కుట్ర: కేటీఆర్

ABN , First Publish Date - 2023-11-19T17:43:27+05:30 IST

సింగరేణిని(Singareni) ప్రైవేటుపరం చేయాలని ప్రధాని మోదీ(PM Modi) కుట్ర పన్నుతున్నారని మంత్రి కేటీ రామారావు ఆరోపించారు.

KTR: సింగరేణి ప్రైవేటుపరం చేయాలని ప్రధాని మోదీ కుట్ర: కేటీఆర్

కొత్తగూడెం: సింగరేణిని(Singareni) ప్రైవేటుపరం చేయాలని ప్రధాని మోదీ(PM Modi) కుట్ర పన్నుతున్నారని మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేటీఆర్(KTR) ఎన్నికల రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు ఆశామాషీవి కావని.. ప్రజల తలరాతలు మార్చేవని అన్నారు.

సింగరేణి ప్రైవేటీకరణ జరగకుండా.. అడ్డుకోవడం బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పాలన కొనసాగడానికి మూడో సారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని కోరారు.


కేటీఆర్ కు నిరసన సెగ..

కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహిస్తుండగా మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. కేటీపీఎస్ ఆర్టీజన్స్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని ప్లకార్డులతో యువకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో నిరసనకారులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-19T17:47:40+05:30 IST