Minister: మంత్రి సబితారెడ్డి కీలక వ్యాఖ్యలు... ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉంది..
ABN , First Publish Date - 2023-10-18T11:03:02+05:30 IST
రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్కే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి సబితారెడ్డి(Minister Sabita Reddy) అన్నారు.
ఎల్‌బీనగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్కే ఓట్లు అడిగే హక్కు ఉందని మంత్రి సబితారెడ్డి(Minister Sabita Reddy) అన్నారు. ఆర్‌కేపురం డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం గ్రీన్‌హిల్స్‌కాలనీలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను చూసి, ఆయా పార్టీల నాయకులు అయోమయానికి గురవుతున్నారన్నారు. గులాబీ జెండా ముందు ఎవరూ నిలబడలేరన్నారు. సీఎం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని ఆమె కార్యకర్తలకు సూచించారు. హైదరబాద్ నగరంలో శాంతిభద్రతలు నెలకొల్పడంతో.. విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. బీజేపీ ప్రజల మధ్య కులమతాల చిచ్చుపెట్టి విభజించు పాలించు అన్న చందంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని కబోది కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అని ఆమె విమర్శించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఇవ్వలేని పెన్షన్.. ఒక్క తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వంలో ఇస్తున్నదని మంత్రి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంటింటికీ ప్రచారం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, మహిళా విభాగం అధ్యక్షురాలు మీన, వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ సునీతారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, యుగంధర్‌శర్మ, దుబ్బాక శేకర్, శ్రీనివాస్ రెడ్డి, కొండ్రు శ్రీనివాస్, లింగస్వామిగౌడ్, కంచర్ల శేఖర్, పుష్పలతరెడ్డి, సాజిద్, రమేష్, మాధవి, సుజాత తదితరులు పాల్గొన్నారు.