Minister Puvwada: మంత్రి పువ్వాడ అంతమాట అనేశారేంటో.. దండాలు పెట్టి షో చేస్తే అభివృద్ధి జరగదు
ABN , First Publish Date - 2023-09-10T13:22:14+05:30 IST
దండాలు పెట్టి షోయింగ్ చేస్తే అభివృద్ధి జరగదని, పట్టుపట్టి నిధులు తెస్తేనే అభివృద్ధి జరుగుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
- ఖమ్మం అభివృద్ధి తప్ప మరో వ్యాపకం లేదు
- రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం: దండాలు పెట్టి షోయింగ్ చేస్తే అభివృద్ధి జరగదని, పట్టుపట్టి నిధులు తెస్తేనే అభివృద్ధి జరుగుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్(Minister Puvwada Ajay Kumar) వ్యాఖ్యానించారు. ఖమ్మం నగరంలోని 15వ డివిజన్ పరిధిలోని గోపాలపురం ప్రధాన రహదారినుండి పుట్టకోట వరకు సుడానిధులు రూ.7.40కోట్లతో నిర్మించనున్న సీసీ రహదారి విస్తరణ, డివైడర్లు, సెంట్రల్‌లైటింగ్ పనులకు శనివారం మంత్రి చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ నవ్వుతూ, దండాలు పెడుతూ కొంతమంది వస్తారని, వారిని నమ్మవద్దన్నారు. విలీన పంచాయితీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ తనను ఉత్తి చేతులతో పంపలేదని, ఖమ్మం అభివృద్దికి ఏకంగా రూ.100 కోట్లు నిధులిచ్చి పంపారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధిసంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలకసంస్థ కమిషనర్ ఆదర్శ్‌సురభి, సుడాఛైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు రావూరి కరుణ, కూరాకుల వలరాజు, ఆంధ్రాబ్యాంక్ ఎఫ్‌ఎస్సీఎస్ ఛైర్మన్ బీరెడ్డి నాగచంద్రారెడ్డి, నగరపాలకసంస్థ ఎస్‌ఈ రంజిత్‌కుమార్, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, నాయకులు రావూరి సైదుబాబు, సంక్రాంతి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
ఖమ్మం నగరంలో ఎంతో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. నగరంలోని 54వ డివిజన్ వీడీవోస్ కాలనీలో వైద్యులు శ్రీరాం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ గతంలో ఇక్కడి ప్రాంతంలోని ప్రజలు అనేక సమస్యలతో బాధ పడ్డారని, వారి కష్టాలు చేప్పుకునేందుకు సరైన వ్యవస్థ కూడా ఉండేదికాదన్నారు. తనకు వేరే వ్యాపకం లేదని, ఖమ్మంను అభివృద్ధి చేయటమే తన వ్యాపకమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఆత్మీయ సమావేశంలో సాంబశివారెడ్డి, మద్దినేని వెంకటరమణ, కుతుంబాక బసవనారాయణ, గరికపాటి వేంకటేశ్వరరావు, నెల్లూరి చంద్రయ్య, చేకూరి సత్యంబాబు, ఏపూరి మధుసూదన్, పోట్ల శ్రీకాంత్, డాక్టర్. మిక్కిలినేని విజయ్‌కుమార్, బత్తుల మురళి, సిరిపురపు సుదర్శన్ పాల్గొన్నారు.