Share News

MLA: అప్రమత్తంగా ఉండండి.. విజయం మనదే...

ABN , First Publish Date - 2023-10-13T10:55:26+05:30 IST

ఎన్నికల వేల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అంతిమ విజయం బీఆర్‌ఎస్‏దేనని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Jubilee Hills MLA Maganti

MLA: అప్రమత్తంగా ఉండండి.. విజయం మనదే...

బంజారాహిల్స్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేల కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అంతిమ విజయం బీఆర్‌ఎస్‏దేనని జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌(Jubilee Hills MLA Maganti Gopinath) అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఎర్రగడ్డ బూత్‌ స్థాయి కమిటీల సమావేశం గురువవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాల గురించి బూత్‌ స్థాయిలో ఉన్న ఓటర్లకు వివరించాలని సూచించారు. బూత్‌ కమిటీ నాయకులు ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలకు చెందిన వారు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని ఇలాంటి వాటివైపు మొగ్గు చూపొద్దని హితవు పలికారు. ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సంజీవ, గంట మల్లేష్‌, సర్ధార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-13T10:55:26+05:30 IST