Marri Janardhan Reddy : కాంగ్రెస్ వాళ్ళను తిరగమనండి.. కాల్చి పండబెడతా

ABN , First Publish Date - 2023-08-28T15:00:26+05:30 IST

కాంగ్రెస్ నాయకులనుఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు. నేడు తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో మర్రి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Marri Janardhan Reddy : కాంగ్రెస్ వాళ్ళను  తిరగమనండి.. కాల్చి పండబెడతా

నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ నాయకులనుఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు. నేడు తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో మర్రి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నాతో పెట్టుకోవద్దు.. నేను అన్ని కట్టెల్లో కాలోచ్చినోడిని.. నా ఊడలు ఎవ్వరూ పెకిలించలేరు. నేను పీకి పడేస్తే చెయ్యి వెళ్ళిపోతుంది. నన్ను గెలుక వద్దు..నా క్యాడర్‌కు చెప్పితే ఆ లుచ్చ నా కొడుకులను తిరగనివ్వరు. దమ్ము ధైర్యం ఉంటే రేపటి నుంచి కాంగ్రెస్ వాళ్ళను తిరగమనండి.. కాల్చి పండబెడతా’’ అంటూ పెద్ద ఎత్తున మర్రి జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2023-08-28T15:00:26+05:30 IST