MLA: ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆసక్తికర కామెంట్స్... ఆయన ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-08-22T13:12:44+05:30 IST

ఎంతో నమ్మకంతో మూడోసారి మానుకోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టిక్కెట్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం

MLA: ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఆసక్తికర కామెంట్స్... ఆయన ఏమన్నారంటే...

మహబూబాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ఎంతో నమ్మకంతో మూడోసారి మానుకోట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టిక్కెట్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌(MLA Banoth Shankarnaik) అన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు బీఆర్‌ఎస్‌ నుంచి మహబూబాబాద్‌ అసెంబ్లీ టికెట్‌ ఖరారు కావడంతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తనను ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిన మాను కోట నియోజకవర్గ ప్రజలను ఎన్నడు వరు వనని, మూడోసారి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తాను నియోజకవర్గంలో 365 రోజులుంటూ పాలేరుగా పని చేస్తున్నానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో మానుకోట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు తన శాయశక్తుల కృషి చేశానని తెలి పారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవగానే 2016లో మానుకోట జిల్లా ను సాధించామని పేర్కొన్నారు. అందరి సహాకారంతో జిల్లాకు మెడికల్‌ కాలేజ్‌, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, మల్యాల హార్టికల్చర్‌ డిగ్రీ కళాశాల, మానుకోట జిల్లా కేంద్రం అభివృద్ధి, ఇను గుర్తిని మండలంగా సాధించామని చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌, పోడు భూములకు పట్టాలు, తండాలను జీపీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని వివరించారు. దేశంలోనే నంబర్‌ వన్‌ సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఉద్యమగడ్డ మానుకోటలో మళ్లీ గులాబీ జెండాను ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో మూడోసారి టిక్కెట్‌ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌లకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

అన్ని వర్గాల సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం ..

మహబూబాబాద్‌ టౌన్‌ : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కార్‌ లక్ష్యమని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ మునిసిపల్‌ 23వ వార్డు పరిధిలోని బాబా గుట్ట ప్రాంతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5లక్షలతో పైపులైన్‌, శ్రీరాంభద్రయ్య కాలనీలో మునిసిపల్‌ సాధారణ నిధులు రూ.5లక్షల తో నిర్మించనున్న సీసీ రోడ్‌ నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ మానుకోట అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక నిధులు వెచ్చించినట్లు చెప్పారు. మానుకోట అంటే సీఎంకు ప్రత్యేక అభిమానమని అందుకోసం ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో రూ.50కోట్లు పట్టణాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. మానుకోట అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది తెలంగాణలో రోల్‌మోడల్‌ పట్టణంగా రూపుదిద్దుకుందన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌ ఎమ్డీ.ఫరీద్‌, వార్డు కౌన్సిలర్‌ మార్నేని శ్రీదేవి రఘు, గద్దె రవి, గోగుల రాజు, ఎమ్డీ. రఫిక్‌, ఎస్కే. ఖలీల్‌, జన్ను మహేందర్‌, ఇస్మాయిల్‌, రఘు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T13:12:44+05:30 IST