TS News: నిండు కుండలా మూసీ జలాశయం
ABN , First Publish Date - 2023-06-05T20:08:47+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)లో రెండో అతిపెద్ద జలాశయమైన మూసీ ప్రాజెక్ట్ (Moose project) జలకళ సంతరించుకుంది.
సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లా (Nalgonda District)లో రెండో అతిపెద్ద జలాశయమైన మూసీ ప్రాజెక్ట్ (Moose project) జలకళ సంతరించుకుంది. హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద మూసీ ప్రాజెక్టుకు చేరుతోంది. మూసీ ప్రాజెక్ట్ గరిష్ఠ నీటి మట్టం 645అడుగులు(4.46టీఎంసీలు) కాగా, సోమవారం ఉదయానికి 644.60అడుగులకు(4.36టీఎంసీలు) చేరుకుంది. దీంతో అప్రమత్తమైన మూసీ అధికారులు సోమవారం ఉదయం ప్రాజెక్ట్ మూడో నెంబర్ గేట్‌ను అర అడుగు మేర ఎత్తి 330క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి విడుదల చేశారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్ట్‌కు ఎగువనుంచి 243.16క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని, సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటి మట్టం 644.60అడుగల వద్దే ఉందని డీఈ చంద్రశేఖర్ తెలిపారు. ప్రాజెక్ట్‌కు చేరే వరద నీటి ప్రకారం నీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు.