Minister KTR: మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష

ABN , First Publish Date - 2023-08-10T18:20:33+05:30 IST

మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌(Metro Rail Master Plan)పై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు(Minister Taraka Rama Rao) సమీక్ష సమావేశం నిర్వహించారు.

Minister KTR: మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌పై   సమీక్ష

హైదరాబాద్(Hyderabad): మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్‌(Metro Rail Master Plan)పై పురపాలక శాఖ మంత్రి తారక రామారావు(Minister Taraka Rama Rao) సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం నాడు హైదరాబాద్ మెట్రో రైల్ భవన్లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు శాఖధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ..‘‘హైదరాబాద్ భవిష్యత్తుకోసం మెట్రోని భారీగా విస్తరించాలి. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరణ పనులు చేపట్టాలి. విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలి. మెట్రోను భారీగా విస్తరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వేగంగా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రత్యేకంగా చర్చించాలి. ఇందుకోసం అవసరమైన 48 ఎకరాల భూమిని మెట్రో డిపో కోసం జీఎంఆర్ అదికారులు అప్పగించాలి’’ అని మంత్రి కేటీఆర్ఆదేశించారు.

Updated Date - 2023-08-10T18:20:33+05:30 IST