Share News

Nagam Janardhan Reddy: పార్టీ మార్పుపై నాగం జనార్దన్‌రెడ్డి ఏమన్నారంటే..?

ABN , First Publish Date - 2023-10-28T20:36:50+05:30 IST

పార్టీ మార్పుపై కార్యకర్తలదే తుది నిర్ణయమని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ( Nagam Janardhan Reddy ) అన్నారు.

Nagam Janardhan Reddy: పార్టీ మార్పుపై నాగం జనార్దన్‌రెడ్డి ఏమన్నారంటే..?

నాగర్ కర్నూల్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తుందని నాగం జనార్దన్‌రెడ్డి ( Nagam Janardhan Reddy ) గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే తన ఆశలపై ఏఐసీసీ నీళ్లు జల్లింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తనకు కావాలనే పార్టీలోని కొంతమంది నేతలు టికెట్ రాకుండా అడ్డుకున్నారని నాగం జనార్దన్‌రెడ్డి కార్యకర్తల వద్ద చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే నాగం జనార్దన్‌రెడ్డి పార్టీ మార బోతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

నాకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉంది: నాగం జనార్దన్‌రెడ్డి

పార్టీ మార్పుపై కార్యకర్తలదే తుది నిర్ణయమని మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ( Nagam Janardhan Reddy ) అన్నారు. శనివారం నాడు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ను ఎంతగానో బలోపేతం చేశాను. నాకు టికెట్‌ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉంది. బోగస్‌ సర్వేల పేరుతో ప్రజలు, నేతలను మోసం చేస్తున్నారు’’ నాగం జనార్దన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-28T20:36:50+05:30 IST