Yadadri: యాదగిరిగుట్టకు పెరిగిన భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2023-12-10T08:15:47+05:30 IST
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. కాగా నిన్న (శనివారం) అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. వ్రతాలు, వాహన పూజలు, పుష్కరిణీలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఒక్కరోజే ఆలయానికి రూ. 62 లక్షల 31, 717 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు.