Kancharla Bhupal: నల్గొండలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కోమటిరెడ్డి కుట్రలు
ABN , First Publish Date - 2023-11-01T10:27:52+05:30 IST
20 ఏళ్లుగా గోస తీసిన నల్గొండను రూ.1350 కోట్లతో సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.
నల్గొండ: 20 ఏళ్లుగా గోస తీసిన నల్గొండను రూ.1350 కోట్లతో సీఎం కేసీఆర్ అద్భుతంగా పునర్నిర్మాణం చేశారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... ఐదేళ్లలో నియోజకవర్గానికి రాని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నోట్ల కట్టలతో నాయకులను కొనుగోలు చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ గట్టున ద్రోహులు ఉంటే... ఈ గట్టున అభివృద్ధి ప్రధాతలు ఉన్నారని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హయాంలో ఐదేళ్లలో నల్గొండలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లక్షలతో కొంతమందిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.