Suryapet Sad Incident: ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సూర్యాపేట.. దృశ్యం సినిమాను తలపిస్తున్న రెండు హత్యలు
ABN , First Publish Date - 2023-10-27T20:31:17+05:30 IST
జిల్లాలో విషాదం నెలకొంది. సూర్యాపేట ( Suryapet ) లో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు దృశ్యం సినిమాను తలపించాయి. ఈ ఘటనతో సూర్యాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
సూర్యాపేట: జిల్లాలో విషాదం నెలకొంది. సూర్యాపేట ( Suryapet ) లో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు దృశ్యం సినిమాను తలపించాయి. ఈ ఘటనతో సూర్యాపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హత్యలకు అక్రమ సంబంధమే కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.... గత కొంతకాలంగా నస్రీన్, భూక్యా వెంకన్న అనే ఇద్దరు వ్యక్తుల మధ్య అక్రమ సంబంధం నడుస్తోంది. అయితే తమకు అడ్డుగా ఉన్న ప్రియురాలు నస్రిన్ భర్త రఫీని, ప్రియుడు భూక్యా వెంకన్న భార్య రమాదేవిని దృశ్యం సినిమాలో లాగా వీరిద్దరూ హత్య చేశారు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధానికి అడ్డులేకుండా ఉండాలని రఫీ, రమాదేవిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మూడు నెలల వ్యవధిలోనే ఇద్దరిని నిందితులు నస్రీన్, భూక్యా వెంకన్న హతమార్చారు. అనుమానం వచ్చి నస్రీన్, భూక్యా వెంకన్నను పోలీసులు విచారించారు. నస్రీన్, భూక్యా వెంకన్ననే రఫీ, రమాదేవి హత్యకి కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ హత్యలకు సారగండ్ల మధు, అక్కినపల్లి శ్రీశైలంలు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిందితులను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వివరాలను సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వెల్లడించారు.