DK aruna: జమిలి ఊహాగానాలే.. డిసెంబర్లోనే ఎన్నికలు
ABN , First Publish Date - 2023-09-12T14:15:49+05:30 IST
బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు.
నిజామాబాద్: బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘సమైక్య దినోత్సవం పేరుతో సీఎం కేసీఆర్ (CM Kcr) కొత్త నాటకం. మజ్లీస్ కోసమే సమైక్యతా నినాదం. తెలంగాణ ప్రత్యేక దేశం అని చెప్పిన కవితకు ఈ ప్రాంతంపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. జమిలి ఎన్నికలు కేవలం ఊహాగానాలే. డిసెంబర్లోనే ఎన్నికలు ఉంటాయనే నమ్మకం ఉంది. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యం. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులను బరిలో దింపుతాం.’’ అని పేర్కొన్నారు.