PM Modi: రేపు తెలంగాణలో పర్యటన

ABN , First Publish Date - 2023-10-02T20:54:53+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం నాడు తెలంగాణలో పర్యటిస్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.

PM Modi: రేపు తెలంగాణలో పర్యటన

నిజామాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం నాడు తెలంగాణలో పర్యటిస్తారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో ప్రధాని మోదీకి సంబంధించిన మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఖరారయింది. మధ్యాహ్నం 2.55 గంటలకు హెలికాప్టర్‌లో నిజామాబాద్ రానున్నారు. కలెక్టరేట్లోని హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో 3.00 గంటలకు గిరిరాజ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 3.00 గంటల నుంచి 3.35 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 3.45 గంటలకు సభావేదికపైకి చేరుకుంటారు. 3.45 గంటల నుంచి 4.45 గంటల వరకు బహిరంగ సభలో ప్రసగింస్తారు. అనంతరం 4.55 గంటలకు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 5.00 గంటలకు హెలికాప్టర్ ద్వారా కర్ణాటక‌లోని బీదర్‌కు వెళ్లనున్నారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు

తెలంగాణలో పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను ప్రధాని మోదీ చేయనున్నారు. మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైలు మార్గంను ప్రారంభింస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్‌-కర్నూల్ మార్గాల మధ్య విద్యుద్ధీకరణను జాతికి ప్రధాని మోదీ అంకితం చేయనున్నారు. సిద్దిపేట-సికింద్రాబాద్ తొలి రైలు సర్వీసును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రూ.8వేల కోట్ల విద్యుత్, రైలు, ఆరోగ్య అంశాలకు సంబంధించిన.. పనులను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. .

Updated Date - 2023-10-02T21:21:31+05:30 IST